మితమెప్పుడూ మేలుగా ఉంటే, అపరిమితం అర్దరహితం

మితమెప్పుడూ మేలుగా ఉంటే, అపరిమితం అర్దరహితంగా ఉండవచ్చును. ఉదా: దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు శనివారం సాయంత్రం దూరదర్శన్ టివీలో ప్రసారం అయ్యే తెలుగు చలనచిత్రం చూడడానికి ఆసక్తి అందరిలో ఉండేది.

ఇప్పుడు రోజు ఉదయం నుండి సాయంకాలం మరియు రాత్రి ఇలా 24 గంటలు తెలుగు సినిమాలు వస్తూ ఉంటే, కొంతమంది ఏ చిత్రం పూర్తిగా చూడకుండా చానెల్స్ మార్చుతూ ఉంటారు. చూస్తున్న చిత్రం మీద ద్యాస కన్నా ఇతర చానెల్లో ఏ చిత్రం వస్తుందో, మనం చూడని చిత్రం వస్తూంటే, ఆచిత్రం మిస్ అవుతామేమో అనే ఆత్రం ఎక్కువగా ఉంటే, అతి అర్ధరహితంగా ఉంటుంది.

శుక్రవారం రాత్రి దూరదర్శన్లో ప్రసారం అయ్యే చిత్రలహరి అంటే ఎంతో ఆసక్తి ఉంటే, ఇప్పుడూ ఆసక్తితో పనితేకుండా స్మార్ట్ మొబైల్ ఫోను ద్వారా ఏ చిత్రంలో పాట అయినా ఏ భాషది అయినా వీక్షించవచ్చును. దీనివలన సమయంకానీ సమయంలో కూడా పాటలు చూస్తూ లేక వింటూ పాటలో ఉన్న విషయం మదిలో చేరకపోవచ్చును.

ఒంటరితనానికి మొదటి మెట్టు స్మార్ట్ ఫోను అతివినియోగం, అందుకు వీడియో పాటలు, ఆడియో పాటలు కారణం కాగలవు. సాంకేతిక సౌకర్యాలను మితంగా ఉపయోగిస్తే, అవి మదికి మేలు చేస్తే, అతిగా ఉపయోగిస్తే అవి మదిగదిలో గోల తప్ప ఒరిగేది ఏముంటుంది.

మితమెప్పుడూ మేలుగా ఉంటే, అతి అర్ధరహితంగా ఉండవచ్చు అనడానికి మీరు కామెంట్ రూపంలో ఎవరైనా చదివేవిధంగా అర్ధవంతంగా వ్రాయండి.

దన్యవాదాలు

పోస్టుపాప